అదేంటోగానీ ఉన్నపాటుగా వీడియో సాంగ్

రీసెంట్‌గా జెర్సీలోని 'అదేంటోగానీ ఉన్నపాటుగా' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

  • Published By: sekhar ,Published On : May 14, 2019 / 12:21 PM IST
అదేంటోగానీ ఉన్నపాటుగా వీడియో సాంగ్

Updated On : May 14, 2019 / 12:21 PM IST

రీసెంట్‌గా జెర్సీలోని ‘అదేంటోగానీ ఉన్నపాటుగా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన జెర్సీ.. ఏప్రిల్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రికెటర్‌గా, ఫ్యామిలీ పర్సన్‌గా నాని నటనకు మంచి మార్కులు పడడమే కాక, అతని కెరీర్‌లో జెర్సీ మైలురాయిగా నిలిచి పోయింది. రీసెంట్‌గా జెర్సీలోని ‘అదేంటోగానీ ఉన్నపాటుగా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ పాటకి కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేసి, చక్కగా పాడాడు.

ఈ బ్యూటిఫుల్ మెలోడిలో లిరిక్స్, వాయిస్‌తో పాటు నాని, శ్రద్ధల కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. నానిని ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసింది జెర్సీ. ఈ సినిమాకి కెమెరా : సంజు జాన్ వర్గీస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వెంకటరత్నం (వెంకట్), నిర్మాత : సూర్యదేవర నాగవంశీ.

వాచ్ వీడియో సాంగ్..