Adhi Dha Surprisu Song : ఐటెం సాంగ్ లో కేతిక శర్మ మల్లెపూల డ్రెస్ వెనుక కథేంటో తెలుసా? డైరెక్టర్ ఏమన్నాడంటే..
ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ కేతిక శర్మ అదిరిపోయే స్టెప్పులు వేసింది.

Adhi Dha Surprisu Song Ketika Sharma Jasmine Flowers Dress Back Story
Adhi Dha Surprisu Song : సాధారణంగానే సెలబ్రిటీల కాస్ట్యూమ్స్ ఎప్పుడూ వార్తలో నిలుస్తాయి. ఇక సినిమాల్లో వేసే డ్రెస్సులు, ముఖ్యంగా హీరోయిన్స్ వేసేవి చర్చకు వస్తాయి. ఇటీవల నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమా నుంచి ‘అదిదా సర్ ప్రైజు..’ అనే ఐటెం సాంగ్ ని రిలీజ్ చేసారు.
ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ కేతిక శర్మ అదిరిపోయే స్టెప్పులు వేసింది. అయితే ఈ పాటలో కేతిక శర్మ మల్లెపూలతో కుట్టిన డ్రెస్ వేసుకుంటుంది. దీంతో ఈ డ్రెస్ బాగా వైరల్ అయింది. ఈ పాటకు రీల్స్ చేస్తున్న వాళ్ళు కూడా మల్లెపూలతో డ్రెస్ లు చేసుకొని మరీ రీల్స్ చేస్తున్నారు.
Also See : Vasanthi Krishnan : భర్తతో కలిసి క్యూట్ హోలీ ఫొటోలు షేర్ చేసిన బిగ్ బాస్ భామ..
నిన్న జరిగిన రాబిన్ హుడ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో డైరెక్టర్ ని ఈ మల్లెపూల డ్రెస్ ఐడియా ఎవరిది? ఎలా వచ్చింది అని యాంకర్ అడిగింది.
దీనికి డైరెక్టర్ వెంకీ కుడుముల సమాధానమిస్తూ.. ఈ సాంగ్ లో హీరోయిన్ ఇంట్రో స్పెషల్ గా ఉండాలి, కాస్ట్యూమ్ స్పెషల్ గా ఉండాలి అని టీమ్ అనుకుంటే అప్పుడే నేను బాల్కనీలో నిల్చున్నప్పుడు ఎవరో మల్లెపూలేయ్ అని అమ్ముకుంటూ వెళ్తున్నారు. అది విని మల్లెపూలతో కాస్ట్యూమ్ చేస్తే బాగుంటుంది అనిపించి చేసాము అని తెలిపారు.
Also Read : Devi Sri Prasad : పెద్ద డైరెక్టర్ నన్ను పిలిచి మ్యూజిక్ కాపీ చేయమన్నాడు.. నేను నో చెప్పి అలా అనేసరికి..