అరవ అర్జున్ రెడ్డి ‘ఆదిత్య వర్మ’ – ట్రైలర్

ధృవ్ విక్రమ్, బనితా సంధు హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 22, 2019 / 07:50 AM IST
అరవ అర్జున్ రెడ్డి ‘ఆదిత్య వర్మ’ – ట్రైలర్

Updated On : October 22, 2019 / 7:50 AM IST

ధృవ్ విక్రమ్, బనితా సంధు హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

తెలుగు సినిమా పరిశ్రమలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాది ఓ ప్రత్యేకమైన స్థానం.. విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ టాలెంటెడ్ డైరెక్టర్‌గా టర్న్ అయ్యారు ఈ సినిమాతో.. హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ సందీప్ దర్శకత్వంలో రూపొంది రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా తమిళనాట ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే..

బాలా దర్శకత్వంలో దాదాపు సినిమా పూర్తయింది కానీ, అవుట్ పుట్ పట్ల హ్యాపీగా లేని మేకర్స్ బాలాను తప్పించి గిరీశయ్య దర్శకత్వంలో సినిమాని రీ షూట్ చేశారు. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, బనితా సంధు హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.. ప్రియా ఆనంద్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రథన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు..

Read Also : జయప్రకాష్ రెడ్డి హీరోగా ‘అలెగ్జాండర్’

రీసెంట్‌గా ‘ఆదిత్య వర్మ’ ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ధృవ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అతని ఎక్స్‌ప్రెషన్స్, హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఒరిజినల్ వెర్షన్‌లోని సోల్ మిస్ కాకుండా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు..

E4 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ నిర్మించి ‘ఆదిత్య వర్మ’ త్వరలో విడుదల కానుంది. మ్యూజిక్ : రథన్, సినిమాటోగ్రఫీ : రవి కె చంద్రన్ ISC, ఎడిటింగ్ : వివేక్ హర్షన్, లిరిక్స్ : థమరై వివేక్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : వెంకట్ ఆర్ముగమ్..