Siddharth – Aditi Rao Hydari : సిద్దార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్.. మై మానికార్న్ అంటే ఏంటి..
సిద్దార్థ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన అదితి. హాపిస్ట్ బర్త్ డే మై మానికార్న్ అంటూ పోస్ట్. మానికార్న్ అంటే ఏంటి..

Aditi Rao Hydari birthday wishes to Siddharth
Siddharth – Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి ఇటీవలే తమ ప్రేమని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వైపు మలుపు తిప్పారు. త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. కాగా నేడు ఏప్రిల్ 17న సిద్దార్థ్ పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తూ వస్తున్నారు.
అయితే నెటిజెన్స్ అంతా అదితి నుంచి వచ్చే విషెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నెటిజెన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ అదితి.. తన ఫియాన్సీకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్ వేశారు. “హాపిస్ట్ బర్త్ డే మై మానికార్న్” అంటూ పోస్ట్ వేశారు. మానికార్న్ అంటే.. ఒకే లక్షణాలు, ఇష్టాలు కలిగి ఉన్న వ్యక్తిని మరో వ్యక్తి సంబోధించడం కోసం ఉపయోగించే పదం.
Also read : Angry Rantman : 27ఏళ్ల వయసులోనే యూట్యూబర్ యాంగ్రీ రాంట్‌మన్ మృతి.. అసలు ఏమైంది..?
అలాగే మరికొంత నోట్ కూడా అదితి రాసుకొచ్చారు. “ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నీకు.. మరింత శక్తి చేకూరాలని, నువ్వు అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఈ నోట్ తో మూడు పిక్స్ ని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram
కాగా సిద్దార్థ్.. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నేడు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి సిద్దార్థ్ న్యూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో సిద్దార్థ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జూన్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.