‘మహాసముద్రం’లో అదితి..

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 04:18 PM IST
‘మహాసముద్రం’లో అదితి..

Updated On : October 12, 2020 / 4:29 PM IST

MahaSamudram: సిద్ధార్థ్‌, శర్వానంద్‌ హీరోలుగా ‘ఆర్.ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి రూపొందిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అదితి రావు హైదరి నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి మధ్య తరగతి అమ్మాయి పాత్రలో నటిస్తుంది.


దర్శకుడు అజయ్‌ భూపతి, ఆమె పాత్రను మలచిన తీరు నచ్చడంతో సినిమాలో నటించడానికి అదితి రావ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇద్దరు హీరోలు నటిస్తుండడంతో మరో కథానాయికకూ చోటుందని తెలుస్తోంది. ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైన ‘వి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అదితి. ‘మహాసముద్రం’ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.


Aditi Rao Hydari