Senior actress Kavitha: కొడుకు చనిపోయిన కొన్నిరోజులకే.. కోవిడ్‌తో సినీనటి కవిత భర్త మృతి
దక్షిణాది చిత్రసీమలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కరోనా కారణంగా కొడుకు చనిపోగా.. పదిహేను రోజులు తిరగకుండానే భర్తను కూడా కోల్పోయారు కవిత. కొడుకును, భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కవిత.

Senior Actress Kavitha
Kavitha’s husaband: దక్షిణాది చిత్రసీమలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కరోనా కారణంగా కొడుకు చనిపోగా.. పదిహేను రోజులు తిరగకుండానే భర్తను కూడా కోల్పోయారు కవిత. కొడుకును, భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కవిత. జూన్ 15వ తేదీన కోవిడ్-19 సమస్యల కారణంగా కొడుకును కోల్పోగా.. ఇవాళ(30 జూన్ 2021) భర్త దూరమయ్యారు.
కుమారుడు సంజయ్ రూప్‌కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ రాగా.. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. ఆరోగ్యం కొన్నిరోజులకు క్షీణించగా ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చేరిన కొన్నిరోజులకే తుది శ్వాస విడిచారు. అయితే, ఈ విషాదం జరిగిన పదిహేను రోజులకే కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కవిత సినీరాజకీయాల్లో రాణిస్తుండగా.. ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు ప్రముఖులు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న కవిత, ప్రస్తుతం సీరియళ్లలో కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 350 చిత్రాల్లో నటించిన కవిత రాజకీయాల్లో కూడా వివిధ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.