Agent Movie : పోకిరి, బాహుబలి 2.. ఇప్పుడు అఖిల్ ఏజెంట్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వుద్దా?

అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజవనుంది. గతంలో పోకిరి, బాహుబలి 2 సినిమాలు కూడా ఇదే డేట్ లో రిలీజయి భారీ హిట్స్ కొట్టాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే డేట్ కి వచ్చి అఖిల్ ఏజెంట్ తో ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడా అని కొంతమంది భావిస్తున్నారు.

Agent Movie : పోకిరి, బాహుబలి 2.. ఇప్పుడు అఖిల్ ఏజెంట్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవ్వుద్దా?

Agent Movie Release on Pokiri and Baahubali 2 Movie Release Date

Updated On : April 23, 2023 / 1:45 PM IST

Agent Movie :  అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్(Agent). మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజవనుంది. గతంలో పోకిరి, బాహుబలి 2 సినిమాలు కూడా ఇదే డేట్ లో రిలీజయి భారీ హిట్స్ కొట్టాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే డేట్ కి వచ్చి అఖిల్ ఏజెంట్ తో ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తాడా అని కొంతమంది భావిస్తున్నారు.

Agent : కొడుకు కోసం రాబోతున్న తండ్రి.. ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా కింగ్ నాగ్..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అఖిల్ ని ఓ మీడియా ప్రతినిధి ఇదే విషయంపై అడిగారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. నా ఫేవరేట్ సినిమాల్లో పోకిరి, బాహుబలి కూడా ఉన్నాయి. ఆ సినిమాలను థియేటర్స్ లో చాలా సార్లు చూశాను. వ్యక్తిగతంగా నాకు పెద్దగా సెంటిమెంట్లు వుండవు. కానీ ఇది నాకు కూడా చెప్పారు. అవి రిలీజయిన డేట్స్ లో నా సినిమా రిలీజవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇలా సెంటిమెంట్ తో చెప్పి సినిమా హిట్ అవుతుంది అంటే నేను కూడా ఆనందంగా ఫీలయ్యాను అని అన్నాడు. మరి పోకిరి, బాహుబలి సినిమాల లాగా అఖిల్ ఏజెంట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో చూడాలి.