Dance Ikon 2 : డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్.. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్.. మానస్ వర్సెస్ ప్రకృతి..

సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది.

Dance Ikon 2 : డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్.. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్.. మానస్ వర్సెస్ ప్రకృతి..

Aha Dance Ikon Season 2 Episode 2 Nominations Maanas Vs Prakruthi

Updated On : February 22, 2025 / 8:33 PM IST

Dance Ikon 2 : ఆహా ఓటీటీలో ఓంకార్ హోస్ట్ గా డ్యాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. రోజు రోజుకూ షో హీటెక్కుతోంది. సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో కార్యక్రమం మరింత ఉత్కంఠగా మారింది. టాప్ ప్లేస్ కోసం ఎవరు పోటీ పడతారు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

Also Read : Anaganaga Teaser : మళ్ళీ వస్తున్న సుమంత్.. ‘అనగనగా’ టీజర్.. తెలుగు భాష ప్రేమికులు చూడాల్సిందే..

గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి పేర్లతో పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి, బర్కత్ అరోరా తమ పర్ ఫార్మెన్స్ లు ఆకట్టుకుంటుండగా వీరికి ఐదుగురు మెంటార్స్ గా మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ వస్తుంది.

Aha Dance Ikon Season 2 Episode 2 Nominations Maanas Vs Prakruthi

Also Read : Naga Chaitanya – Sobhita : చైతూ – శోభితల మంచి మనుసు.. క్యాన్సర్ తో బాధపడుతున్న పిల్లలతో.. ఫోటోలు వైరల్..

డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ ఉత్కంఠ కలిగిస్తూ సాగాయి. టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం.. మానస్ నాగులపల్లి టీమ్ ‘ఫైర్’ ని నామినేట్ చేసింది. రివేంజ్ గా ప్రకృతి మెంటార్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపికా జానులైరి ‘వాటర్’ ను నామినేట్ చేయగా, ప్రతీకారంగా జనులైరి, దీపిక ‘ఎయిర్’ ను నామినేట్ చేసింది. యశ్ మాస్టర్ ‘స్కై’ మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. ఈ నామినేషన్స్ ప్రక్రియ రాబోయే రోజుల్లో డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ మరింత సస్పెన్స్ గా ఉండబోతున్నట్లు హింట్ ఇస్తోంది.

Aha Dance Ikon Season 2 Episode 2 Nominations Maanas Vs Prakruthi