Aha Dance Ikon 2 : నేటి నుంచే ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ షో.. ఇలాంటి షో ఇప్పటిదాకా చూడలేదు..
డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షో నేడు ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

Aha Dance Ikon Season 2 Wild Fire Streaming from today
Aha Dance Ikon 2 : ఆహా ఓటీటీలో గతంలో స్ట్రీమింగ్ అయిన డాన్స్ ఐకాన్ షో సక్సెస్ అయింది. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షో నేడు ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ రానుంది. ఈ షోలో యాంకర్‌గా ఓంకార్, జడ్జిలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లాలు వ్యహరించనున్నారు. ఈ షోలో మెంటార్స్ గా మానస్, యశ్ మాస్టర్, నటి దీపికా, డ్యాన్సర్ జాను లైరి, మోడల్ ప్రకృతిలు ఉండబోతున్నారు.
Also Read : Aha Love Movies : వాలెంటైన్స్ డే స్పెషల్.. ఆహాలో ఈ లవ్ సినిమాలు చూసేయండి..
తాజాగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ.. సాధారణంగా తెలుగు నుంచి కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తాం కానీ ఈసారి దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ ఆడిషన్ చేసి అందులో నుంచి పంచభూతాల్లాంటి ఐదుగురు వండర్ ఫుల్ కంటెస్టెంట్స్ ను తీసుకున్నాం. వారికి పోటీ ఇచ్చే సత్తా ఉన్న తెలుగు కంటెస్టెంట్స్ ను ఇప్పుడు సెలెక్ట్ చేయబోతున్నాం. టఫ్ కాంపిటేషన్ లో మన వాళ్లు టాలెంట్ చూపించాలనే ఇలా చేస్తున్నాం. మీరు చేసిన 60 సెకన్ల డ్యాన్స్ వీడియో మాకు పంపిస్తే అది చూసి ఎంట్రీలను తీసుకుంటాం. మూడు నెలల పాటు డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ షోను ప్రేక్షకులను ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ సెకండ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. కంటెస్టెంట్స్ తో పాటు మెంటార్స్ కూడా ఎలిమినేట్ అవుతారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ ఇప్పటిదాకా వచ్చిన డ్యాన్స్ షోస్ అన్నింటిలో కొత్తగా ఉంటుంది అని తెలిపారు.
మెంటార్ మానస్ మాట్లాడుతూ.. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ షోలో ఒక మెంటార్ గా నా కంటెస్టెంట్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తా. నా ద్వారా నా కంటెస్టెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తాను. ఓంకార్ గారు ఈ షోను అద్భుతంగా డిజైన్ చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా రాలేదు అని అన్నారు. మెంటార్ యష్ మాస్టర్ మాట్లాడుతూ.. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ లాంటి డ్యాన్స్ షో తెలుగులోనే కాదు ఇంకెక్కడా రాలేదు. నేను రియాల్టీ షోస్ నుంచే వచ్చాను. ఈ మధ్య రియాల్టీ షోస్ మిస్ అవుతున్నాను. ఓంకార్ గారు ఈ షో గురించి చెప్పగానే వెంటనే ఓకే అన్నాను. డ్యాన్స్ షోస్ లో విన్ అవడం నాకు కొత్త కాదు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ లో కూడా గెలుస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని తెలిపారు.
మెంటార్ ప్రకృతి మాట్లాడుతూ. డ్యాన్స్ ఐకాన్ 1 ఒక ఆడియెన్ గా చూశాను. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ లో మెంటార్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇదొక యూనిక్ డ్యాన్స్ షో. కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ లతో పాటు షోలోని ప్రతి మూవ్ మెంట్ మీరంతా ఎంజాయ్ చేస్తారు అని తెలిపింది.