Telugu Indian Idol Season 3 : ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3’.. టాప్ 12 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..
ఫైనల్ గా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3కి టాప్ 12 మంది కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశారు.

Aha Telugu Indian Idol Season 3 Final Top 12 Contestants List
Aha Telugu Indian Idol Season 3 : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా గతంలో సినీ పరిశ్రమకు ఎంతోమంది సింగర్స్ ని పరిచయం చేసి, ఎంతోమందిలో ఉన్న సింగింగ్ ట్యాలెంట్ బయటకి తీశారు. ఈసారి సీజన్ 3 కోసం 37 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించగా దాదాపు 15వేల మందికి పైగా పాల్గొనగా అందులో మొదట 100 మందికి పైగా గాయకులను ఫైనల్ ఆడిషన్ చేశారు.
ఆ 100 మందికి జడ్జీలు థమన్, కార్తీక్, గీతా మాధురి ముందు ఆడిషన్‌కు అవకాశం వచ్చింది. 2 వారాల పాటు సాగిన నాలుగు ఎపిసోడ్స్ గా ఈ ఆడిషన్‌లు ఆహాలో స్ట్రీమింగ్ చేశారు. ఎంతోమంది ట్యాలెంటెడ్ సింగర్స్ రాగా వారి జీవిత కథలను కూడా చెప్పడంతో ఎన్నో ఎమోషనల్ స్టోరీలు బయటకు వచ్చాయి. ఫైనల్ గా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3కి టాప్ 12 మంది కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేశారు.
టాప్ 12 కంటెస్టెంట్స్ వీళ్ళే..
1. స్కంద
2. హరిప్రియ
3. శ్రీ కీర్తి
4. కేశవ్ రామ్
5. సాయి వల్లభ
6. అనిరుధ్ సుస్వరం
7. ఎల్ కీర్తన
8. భరత్ రాజ్
9. రజనీ శ్రీ పూర్ణిమ
10. నజీరుద్దీన్ షేక్
11. ఖుషాల్ శర్మ
12. శ్రీ ధృతి
జూన్ 28 నుంచి ఈ టాప్ 12 కంటెస్టెంట్స్ తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. ప్రేక్షకుల ఓటింగ్, న్యాయమూర్తుల తీర్పు ఆధారంగా విన్నర్ ని సెలెక్ట్ చేస్తారు. మరి ఈ 12 మందిలో తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ సీజన్ 3 షో ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ అవ్వనుంది.