Telugu Indian Idol : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4.. హైదరాబాద్ లో ఆడిషన్స్.. ఎప్పుడు? ఎక్కడ?
ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తవగా త్వరలో నాలుగో సీజన్ మొదలు కానుంది.

Telugu Indian Idol
Telugu Indian Idol : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాడానికి సాంగ్స్, డ్యాన్స్ షోలను కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్, తెలుగు వాళ్ళ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి షోని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసారు. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తవగా త్వరలో నాలుగో సీజన్ మొదలు కానుంది.
గత కొన్ని రోజులుగా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కి ఆన్లైన్ లో ఆడిషన్స్ అవ్వగా ఇప్పుడు ఆఫ్ లైన్ లో ఆడిషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ లోని JNTUH మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రిషి ఎమ్.ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్ట్ 3న గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టు ఆహా ప్రకటించింది.
Also Read : Sudheer – Pradeep : చాన్నాళ్లకు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్న సుధీర్ – ప్రదీప్.. ప్రోమో వైరల్..
ఇంకెందుకు ఆలస్యం మీలో మంచి సింగర్ ఉంటే ఈ ఆడిషన్స్ కి వెళ్లి ఆహా షోలో పాడే ఛాన్స్ కొట్టేయండి. ఇక ఈసారి కూడా తమన్, గీతామాధురి, కార్తీక్ లు జడ్జీలుగా ఉండబోతున్నారు.
Also Read : Kingdom : హిందీలో మరో పేరుతో రిలీజ్ అవ్వబోతున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’.. బాలీవుడ్ టైటిల్ ఏంటో తెలుసా?