Unstoppable with NBK S4 : బాల‌య్య‌తో వెంకీ.. అన్‌స్టాపబుల్ షో ప్రొమో వ‌చ్చేసింది..

ఏడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను ఆహా విడుద‌ల చేసింది.

Aha Unstoppable With Nbk Balakrishna Venkatesh Episode 7 Promo Released

బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో ఆహా ఓటీటీలో దూసుకుపోతుంది. మూడు సీజ‌న్లు పూర్తి కాగా తాజాగా నాలుగో సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్ ఏడో ఎపిసోడ్‌కు విక్టరీ వెంక‌టేష్ వ‌చ్చారు. ఆయ‌న న‌టిస్తున్న మూవీ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’  ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ షోలో సంద‌డి చేశారు.

తాజాగా ఏడో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను ఆహా విడుద‌ల చేసింది. విక్టరీ వెంక‌టేష్‌ను బాల‌య్య స్టేజీ పైకి పిలిచారు. పోటీనా మ‌నం.. ఒక‌రికి ఒక‌రికి అంటూ వెంక‌టేశ్‌ను బాల‌య్య అడిగాడు. ఎక్క‌డమ్మా పోటీ అంటూ వెంక‌టేష్ అన్నాడు.

Vijay-Rashmika : మళ్ళీ ఒకే చోట విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ సెలబ్రేషన్స్ కోసమేనా..?

మొత్తంగా స‌ర‌దా విష‌యాల‌తో పాటు ప‌లు సీరియ‌స్ విష‌యాల‌ను కూడా వెంక‌టేష్ పంచుకున్న‌ట్లుగా ప్రొమోను బ‌ట్టి అర్థం అవుతోంది. ప్రొమో ఆఖ‌రిలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి వ‌చ్చాడు.

ఇక ఈ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 27 రాత్రి 7 గంట‌ల‌కు ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది.