Vijay-Rashmika : మళ్ళీ ఒకే చోట విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ సెలబ్రేషన్స్ కోసమేనా..?

ఒకేసారి విజయ్, రష్మిక ముంబయి విమానాశ్రయంలో కనిపించడంతో ఈ జోడి మరోసారి వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళుతున్నారని నెటిజన్స్ అంటున్నారు.

Vijay-Rashmika : మళ్ళీ ఒకే చోట విజయ్ దేవరకొండ, రష్మిక.. ఆ సెలబ్రేషన్స్ కోసమేనా..?

Vijay Devarakonda and Rashmika at the same place again photos goes viral

Updated On : December 24, 2024 / 11:53 AM IST

Vijay-Rashmika : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరో గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వసరం లేదు. అయితే విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలనే నిజం చేస్తూ ఈ జంట వెకేషన్స్ కి వెళుతుంటారు.

Also Read : Allu Arjun : భారీ బందోబస్తుతో.. మరి కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్..

ఇక తాజాగా మరోసారి ఒకే చోట దర్శనమిచ్చారు ఈ జోడి. ఈ ఇద్దరూ ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. సోమవారం రాత్రి రష్మిక ముందుగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి పలు ఫొటోలకి ఫోజులిచ్చింది. అనంతరం రష్మిక వెళ్లిపోయిన తర్వాత కొద్ది సేపటికి అదే ప్లేస్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు.

అలా ఒకేసారి విజయ్, రష్మిక ముంబయి విమానాశ్రయంలో కనిపించడంతో ఈ జోడి మరోసారి వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళుతున్నారని నెటిజన్స్ అంటున్నారు. త్వరలోనే క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ సందర్బంగా సెలబ్రేషన్స్ కోసం ముంబయి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ జంట కలిసి కొన్ని వెకేషన్స్ కి వెళ్లారు. వాటికి సంబందించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. కానీ తాము రిలేషన్ లో ఉన్నామని మాత్రం బయటపెట్టడం లేదు రష్మిక, విజయ్.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)