ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. అమితాబ్, అభిషేక్ ఇంకా హాస్పిటల్‌లోనే..

  • Published By: sekhar ,Published On : July 27, 2020 / 05:40 PM IST
ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. అమితాబ్, అభిషేక్ ఇంకా హాస్పిటల్‌లోనే..

Updated On : July 29, 2020 / 9:36 AM IST

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ సోమవారం ఒక శుభవార్తను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ సోకిన తన భార్య, హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ‍్య ఇంటికి చేరారని అభిషేక్ ప్రకటించారు.Aishwarya Raiతాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్‌-19 నిర్దారిత పరీక్షల్లో నెగెటివ్ రావడంతో వారు నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారంటూ ట్వీట్‌ చేశారు.



Amitabh Bachchan-Abhishek Bachchan

అయితే తన తండ్రి బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ కుటుంబం కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ అభిషేక్‌ ధన్యవాదాలు తెలిపారు.