మానసి నాయక్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారుగా..

అచ్చు ఐశ్వర్యరాయ్‌లా నెటిజన్లను ఆకట్టుకుంటున్న మరాఠి నటి మానసి నాయక్..

  • Published By: sekhar ,Published On : March 19, 2020 / 11:11 AM IST
మానసి నాయక్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారుగా..

Updated On : March 19, 2020 / 11:11 AM IST

అచ్చు ఐశ్వర్యరాయ్‌లా నెటిజన్లను ఆకట్టుకుంటున్న మరాఠి నటి మానసి నాయక్..

మానసి నాయక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె వార్తల్లో నిలవడానికి ప్రధాన కారణం అచ్చు ఐశ్వర్య రాయ్‌లా ఉండడమే.. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. సెలబ్రిటీల పోలికలతో ఎవరైనా ఒకరు కనిపిస్తే చాలు.. వాళ్లు కూడా సెలబ్రిటీలయిపోతారు.

మరాఠీ నటి మానసి నాయక్.. అందాల సుందరి ఐశ్వర్య రాయ్ పోలికలతో ఉండడంతో బాగా ఫేమస్ అయింది. ఆమె పిక్స్, వీడియోస్.. ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె అచ్చు ఐశ్వర్యాలాగే ఉందని తెగ పొగిడేస్తున్నారు నెటిజన్స్..

Manasi

తనను ఐశ్యర్యరాయ్‌తో పోల్చడంతో తెగ సంబరపడిపోతుంది మనసి నాయక్‌. ఐశ్వర్యరాయ్‌ సినిమాలోని పాటలకు టిక్‌టాక్‌ వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది మానసి. ఆ వీడియోలు చూసి ‘ఐశ్యర్యరాయ్‌ డూబ్లికేట్‌’, ‘ఐశ్యరాయ్‌ జిరాక్స్‌’, ‘యంగ్‌ ఐశ్యర్యరాయ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

4 మిలియన్ల మంది ఆమె టిక్‌టాక్‌ వీడియోలను ఫాలో అవుతున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 9,43,537 మంది ఫాలోవర్స్‌ ఉన్నారంటే మానసి క్రేజ్ ఏ రేంజ్‌‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘బాగ్తోయి రిక్షావాలా’ అనే ఐటమ్‌ సాంగ్‌లో నటించి ఫేమస్‌ అయిన మానసి, తర్వాత ‘జబర్దస్త్‌’, ‘టార్గెట్‌’, ‘కుటుంబ్‌’, ‘టీన్ బేకా ఫాజిటి ఐకా’ తదితర మరాఠి చిత్రాలలో నటించిందామె. బాలీవుడ్ బ్యూటీ స్నేహా ఉల్లాల్ కూడా ఐష్ పోలికలుండడంతో జూనియర్ ఐశ్వర్యరాయ్‌లా సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.