Aishwarya Rajesh : హెల్త్ కేర్ యూనిట్ ని ప్రారంభించిన సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్..
తాజాగా హైదరాబాద్ లో ఓ హెల్త్ కేర్ యూనిట్ ని ప్రారంభించింది ఐశ్వర్య రాజేష్.

Aishwarya Rajesh Opened Kolors Health Care Unit in Hyderabad
Aishwarya Rajesh : తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ వరుసగా తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు తెలుగులో కూడా పలు సినిమాలతో పలకరిస్తుంది. ఇటీవల సంక్రాంతికి వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టింది ఐశ్వర్య రాజేష్. ఈ హిట్ తో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. తాజాగా హైదరాబాద్ లో ఓ హెల్త్ కేర్ యూనిట్ ని ప్రారంభించింది ఐశ్వర్య రాజేష్.
Also Read : Sundeep Kishan : ఆ సినిమా నుంచి సందీప్ కిషన్ హీరోగా తప్పుకున్నాడా? తీసేసారా? సందీప్ ప్లేస్ లో హీరో ఎవరంటే..?
హెల్త్ కేర్ సంస్థ కలర్స్ బంజారా హిల్స్ బ్రాంచీలో ఐశ్వర్య రాజేష్ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ముఖ్యం. ఈ సేవలను నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో కలర్స్ సంస్థ నిర్వాహకులు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాము. లైఫ్‌స్టైల్ బాగుండాలని కోరుకునే వారందరికీ ఈ సంస్థ మెరుగైన సేవలు అందిస్తూ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో కలర్స్ హెల్త్ కేర్ 2.Oగా ఎదగడం మంచి విషయం అని తెలిపారు.
కలర్స్ హెల్త్ కేర్ సీవోవో శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభించిన కలర్స్ హెల్త్ కేర్ సేవలకు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని జోడిస్తూ కలర్స్ హెల్త్ కేర్ 2.O ని ప్రారంభించాము ప్రస్తుతం 50 బ్రాంచీలు ఉన్న కలర్స్ హెల్త్ కేర్ ను వచ్చే ఏడాది చివరి కల్లా దేశవ్యాప్తంగా 250 బ్రాంచీలకు విస్తరించనున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.