Ajay Devgn – Jackie Chan : జాకీ చాన్ – అజయ్ దేవగణ్ స్పెషల్ ఇంటర్వ్యూ.. కరాటే కిడ్ – లెజెండ్స్ కోసం..

జాకీ చాన్, బెన్ వాంగ్తో కలిసి అజయ్ – యుగ్ దేవగణ్ ఆన్లైన్ లో మాట్లాడి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

Ajay Devgn – Jackie Chan : జాకీ చాన్ – అజయ్ దేవగణ్ స్పెషల్ ఇంటర్వ్యూ.. కరాటే కిడ్ – లెజెండ్స్ కోసం..

Ajay Devgn Jackie Chan Special Interview for Karate Kid Legends

Updated On : May 28, 2025 / 3:43 PM IST

Ajay Devgn – Jackie Chan : సూపర్ హిట్ చైనీస్ ఫ్రాంచైజ్ సినిమా కరాటే కిడ్ నుంచి ఆరవ భాగం కరాటే కిడ్ – లెజెండ్స్ రానుంది. జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది. అయితే హిందీలో కరాటే కిడ్ : లెజెండ్స్ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, అతని కొడుకు యుగ్ దేవగణ్ డబ్బింగ్ చెప్పారు.

ఇలా ఈ సినిమాతో అజయ్ తనయుడు యుగ్ దేవగణ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా విడుదలకు ముందు జాకీ చాన్, బెన్ వాంగ్తో కలిసి అజయ్ – యుగ్ దేవగణ్ ఆన్లైన్ లో మాట్లాడి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

Also Read : Maargan Trailer : విజయ్ ఆంటోని ‘మార్గన్’ ట్రైలర్ రిలీజ్.. మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్.. విలన్ ఎవరో ఎలుసా?

ఈ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్.. తన తండ్రి వీరు దేవగణ్ గురించీ, జాకీ చాన్ గురువు మిస్టర్ మియాగీగురించి మాట్లాడారు. యుగ్ దేవగణ్ తన తండ్రి లేనిదే నేను లేను అని చెప్పాడు. అలాగే అజయ్.. ఇప్పుడు యాక్షన్ సీన్స్ చాలా ఈజీ. మునుపటిలా కేబుల్స్ వాడి గ్రాఫిక్స్ లేకుండా చేసే రోజుల్లో పని చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వలన తేలికైంది. కానీ హార్డ్ వర్క్‌కి మాత్రం ఎప్పుడూ ప్రత్యామ్నాయం లేదు అని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో జాకీ చాన్ మాట్లాడుతూ.. బాలీవుడ్ డ్యాన్స్ చూసినప్పుడల్లా ఆశ్చర్యపోతా. అంతటి టైమింగ్, గ్రేస్, రిథమ్ ఉంటాయ్. ఒకసారి మాత్రం నేను ఫుల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయాలి అనిపించింది. యాక్షన్ – డ్యాన్స్ రెండూ ఒకే కోవలోకి వస్తాయి. అందుకే నేను డ్యాన్స్‌ని యాక్షన్‌గా చూస్తా అన్నారు. అలాగే జాకీ చాన్ ఒక బాలీవుడ్ మూవీకి పూర్తిస్థాయి పాత్ర చేయాలని ఉందని తెలిపారు. దీంతో జాకీచాన్ బాలీవుడ్ సినిమా చేస్తారనే వార్త వైరల్ అవుతుంది. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మీరు కూడా చూసేయండి..

 

Also Read : Kannappa Song : ‘కన్నప్ప’ కోసం మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా పాడిన పాట రిలీజ్.. శ్రీకాళహస్తి అంటూ..