CM Pellam Movie : ‘సీఎం పెళ్ళాం’ రిలీజ్ కి రెడీ.. గవర్నర్ కి వినతి పత్రం ఇస్తామంటున్న డైరెక్టర్..
ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది.

Ajay Indraja CM Pellam Movie Ready to Release Director Interesting Comments
CM Pellam Movie : అజయ్, ఇంద్రజ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘CM పెళ్లాం’. బీఆర్‌కే నిర్మాణంలో రమణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు మూవీ యూనిట్.
ఈ క్రమంలో డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తి కాకుండా ఆయన భార్య కూడా ఓట్లు అడుగుతారు. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు? సినిమా ద్వారా ఈ ప్రశ్నను నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే బిజీగా ఉండి బయట తిరుగుతుంటే ఇంటికి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వ్యక్తులను ఎమ్మెల్యే భార్య కలిస్తే చాలా మార్పులొస్తాయని నా నమ్మకం. అదే ఈ సినిమాలో చూపించాను. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బుూతు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు బుూతులు మాట్లాడకూడదన్న పాయింట్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నా. ఈ క్రమంలోనే హైకోర్టుకు, గవర్నర్‌కు ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నాను. రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడితే రాజకీయాల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే రూల్ తీసుకురావాలని కోరబోతున్నాను అని అన్నారు.
Also See : Rahasya Gorak : కిరణ్ అబ్బవరం భార్యకు సీమంతం.. రహస్య గోరఖ్ బేబీ బంప్ ఫోటోలు వైరల్..
నటుడు అజయ్ మాట్లాడుతూ.. రమణారెడ్డి గారు ఒక బౌండ్ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. ఈ మధ్య కాలంలో బౌండ్ స్క్రిప్ట్స్ తో ఎవరూ రావట్లేదు. కథ ఉమన్ ఎంపవర్‌మెంట్ మీద ఉంది. పొలిటికల్‌గా ఏమేం మార్పులు చేస్తే బాగుంటుందనే దానిపై ఆయన సినిమా చేస్తున్నారు. అందుకే ఈ పాయింట్ నచ్చి సినిమా చేశాను. ఇంద్రజ గారితో ‘దిక్కులు చూడకు రామయ్య’ తర్వాత కలిసి పని చేశాను. మంచి మెసేజ్ ఉన్న సినిమా అందరూ చూడండి అని అన్నారు.
నిర్మాత రామకృష్ణ మాట్లాడుతూ.. పొలిటికల్‌తో పాటు ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ల గురించి, ఓట్ల గురించి, ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి.. ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి. పొలిటికల్ లీడర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రం ఎలా బాగు పడుతుంది అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించాము. ఈ సినిమా చూశాక ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా అని తెలిపారు.