Bigg Boss : మొన్న తప్పుగా తాకడని మందలించింది.. ఇప్పుడు ఏకంగా 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. వీడియో వైరల్!

హిందీ బిగ్ బాస్ OTT 2 జియో సినిమాలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షోలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వగా.. ఇద్దరు కంటెస్టెంట్స్ 30 సెకన్ల పాటు లిప్‌లాక్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Bigg Boss : మొన్న తప్పుగా తాకడని మందలించింది.. ఇప్పుడు ఏకంగా 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. వీడియో వైరల్!

Akanksha Puri Jad Hadid lip lock kiss in hindi Bigg Boss OTT2

Updated On : June 30, 2023 / 9:07 AM IST

Bigg Boss OTT 2 : దేశంలోని పలు సినీ పరిశ్రమలో పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ షో మంచి ప్రజాధారణ పొందింది. ఇక బాలీవుడ్ లో అయితే ఈ షో టెలివిజన్ అండ్ ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జియో సినిమాలో బిగ్ బాస్ OTT 2 ప్రసారం అవుతుంది. ఇక ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి ప్రతి ఎపిసోడ్ హాట్ టాపిక్ అయ్యిపోయింది. ఈ సీజన్ మొదలైన 24 గంటలోనే ఒక కంటెస్టెంట్ ని తొలగించడం బిగ్‌ బాస్‌ హిస్టరీలోనే మొదటిసారి.

Balakrishna : సుమకి చెంప దెబ్బలు పడాలి.. జగపతిబాబు సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..

ఇక ఆ తరువాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరిల వివాదం హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని ఎపిసోడ్‌ల క్రిందట.. హదీద్ ఆకాంక్ష నడుమును పట్టుకొని దగ్గరికి లాగుతూ కొంచెం శృతిమించిన ప్రవర్తనతో కనిపించాడు. ఇక ఆ ప్రవర్తనతో అసౌకర్యంగా ఫీల్ అయిన ఆకాంక్ష.. అతని వెనక్కి నెట్టి ఇలా తాకడం తనకి ఇష్టం లేదని, మరొకసారి ఇలా చేయవద్దని అక్కడే మందలించింది. ఇక ఆకాంక్ష అసౌకర్యాన్ని చూసిన ఆడియన్స్ జైద్ హదీద్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీని పై షో హోస్ట్ అయిన సల్మాన్ కూడా చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by ?ꫀꪖꪶⅈ?ꪗ ?ꪖᦔ?ꪖ (@reality__tadka)

అయితే ఇంతలోనే ఆకాంక్ష పూరి, జైద్ హదీద్ కి ఘాటు ఫ్రెంచ్ కిస్ ఇవ్వడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. బిగ్‌బాస్‌ టాస్క్ లో భాగంగా ‘డేర్ గేమ్’ అంటూ ఒక పోటీ పెట్టాడు. ఆ టాస్క్ లో 30 సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలి. ముందుగా ఈ పోటీలో పాల్గొనేందుకు ఎవరు ధైర్యం చేయలేదు. కానీ ఆ తరువాత హదీద్ అండ్ ఆకాంక్ష ముందుకు వచ్చి 30 సెకన్ల పాటు లిప్‌లాక్ చేసుకొని వైరల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీని పై కొందరు నెటిజెన్ల ఫైర్ అవుతున్నారు. ఇలాంటి టాస్క్ లు ఇవ్వడం ఏంటని షో నిర్వాహుకుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.