Akhanda Hotel : ‘అఖండ’ అభిమానం.. ఆరగించిపోండి..

తన హోటల్‌కి ‘అఖండ’ పేరు పెట్టుకున్న బాలయ్య వీరాభిమాని..

Akhanda Hotel : ‘అఖండ’ అభిమానం.. ఆరగించిపోండి..

Akhanda Hotel

Akhanda Hotel: అభిమానులు అందరికీ ఉంటారు కానీ భక్తులు మాత్రం మా బాలయ్య బాబుకే ఉంటారు అని గర్వంగా చెప్పుకుంటుంటారు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ బాలయ్యను స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.

Akhanda : అరవై రోజులు.. అయినా ఆగని ‘అఖండ’ అరాచకం!

ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బాలయ్య మీద తమకున్న ప్రేమను, అభిమానాన్ని రకరకాలుగా చాటుకుని, ఇతర హీరోల అభిమానులకు ఆదర్శంగా నిలిచారు బాలయ్య ఫ్యాన్స్. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్‌తో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. థియేట్రికల్ రన్, డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ తమ అభిమాన హీరో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పలు సందర్భాల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Balakrishna : బాలయ్య ‘మంగళవారం మెనూ’ మామూలుగా లేదుగా!

ఇప్పుడు ‘అఖండ’ పేరుని ఓ అభిమాని తన హోటల్‌కి పెట్టుకోవడంతో బాలయ్య అభిమానులతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుపతిలో బాలయ్య వీరాభిమాని ఒకరు ‘అఖండ’ పేరుని హోటల్‌కి పెట్టారు. దీనికి సంబంధించిన పిక్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘బాలయ్య మీద అభిమానం అంటే ఇది’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్.. పాండమిక్ కారణంగా క్వశ్చన్ మార్క్‌తో ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘అఖండ’ తో సరికొత్త ఊపుని, ఉత్సాహాన్ని ఇచ్చారు నటసింహ నందమూరి బాలకృష్ణ-ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ జనవరి 20తో 50 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 21 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ బాలయ్య బొమ్మ రచ్చ రంబోలా చేస్తుండడం విశేషం.