Akhanda : అరవై రోజులు.. అయినా ఆగని ‘అఖండ’ అరాచకం!

60వ రోజూ బాక్సాఫీస్ బరిలో ‘అఖండ’ గర్జన కొనసాగిస్తున్నాడు నటసింహ నందమూరి బాలకృష్ణ..

Akhanda : అరవై రోజులు.. అయినా ఆగని ‘అఖండ’ అరాచకం!

Akhanda Roaring

Akhanda: సరైన సాలిడ్ సినిమా పడితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో.. బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో సెకండ్ వేవ్ తర్వాత యావత్ ప్రపంచానికి శాంపిల్ చూపించారు నటసింహ నందమూరి బాలకృష్ణ-ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లా, పెదనందిపాడులో ట్రాక్టర్లు వేసుకుని మరీ సినిమా చూడ్డానికి థియేటర్లకు వచ్చారంటే ఇక బాలయ్య స్టామినా, సినిమా రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

Akhanda Theatre

బెన్‌ఫిట్ షోలు లేవు.. స్పెషల్ పర్మిషన్లు లేవు.. టికెట్ రేట్లు పెంచలేదు.. పైగా పండుగ సీజన్ కాదు.. థియేటర్లోకి సినిమాలు.. ఆ సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు రావడానికి భయపడుతున్న టైంలో ‘అఖండ’ గా వచ్చి తన నట విశ్వరూపంతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టి.. పట్టుమని పదిరోజులు కూడా థియేటర్లలో సినిమాలు ఉండలేకపోతున్న ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్ బొమ్మతో 50 రోజుల పోస్టర్ పడేలా చేసి.. తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసి, ఇతర హీరోలకు, ఇండస్ట్రీలకు దిక్సూచిలా నిలిచాడు బాలయ్య..

Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..

వీకెండ్, వీక్ డేస్, ఫెస్టివల్ అనే తేడా లేకుండా ప్రతిరోజు థియేటర్ల దగ్గర అసలు సిసలు మాస్ జాతర కనిపించింది. జనవరి 21 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. డిజిటల్ స్ట్రీమింగ్‌కి కూడా భారీ కటౌట్ పెట్టడం.. ఊరు ఊరంతా కలిసి రోడ్ మీద స్క్రీన్ ఏర్పాటు చేసి సెలబ్రేషన్స్‌తో ‘అఖండ’ చూడడం అంటే అది బాలయ్య క్రేజ్‌కి నిదర్శనం.

ఓటీటీలో విడుదలైనా థియేటర్లకు క్యూ కడుతున్నారు జనాలు.. జనవరి 30 నాటికి 60 రోజులు పూర్తి చేసుకుంది. ఆదివారం నాడు కర్నూలులోని విక్టరీ థియేటర్‌లో ఫస్ట్ షోకి బుకింగ్ ముందు క్యూ లో నిలబడ్డారు ప్రేక్షకులు. అదికూడా 60వ రోజు కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఇదీ మా బాలయ్య స్టామినా’ అంటున్నారు ఫ్యాన్స్.

Kurnool Victory Theatre