Jai Balayya : బాలయ్య క్లాస్‌లో మాస్.. ఆ స్టెప్పులేంటి స్వామీ!

‘జై బాలయ్య’.. ఈ స్లోగన్‌తో నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎక్కడలేని ఎనర్జీ, ఊపు, ఉత్సాహం వస్తాయి..

Jai Balayya : బాలయ్య  క్లాస్‌లో మాస్.. ఆ స్టెప్పులేంటి స్వామీ!

Jai Balayya

Updated On : November 28, 2021 / 3:28 PM IST

Jai Balayya: ‘జై బాలయ్య’.. ఈ స్లోగన్‌తో నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎక్కడలేని ఎనర్జీ, ఊపు, ఉత్సాహం వస్తాయి. అలాంటిది ‘జై బాలయ్య’ పేరుతో ఓ సాంగ్ ఉంటే ఫ్యాన్స్‌కి ఏ రేంజ్ కిక్ వస్తుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు కదా..

Akhanda Pre Release Event : ‘అఖండ’ సాక్షిగా బన్నీ – బాలయ్య బాండింగ్ అదిరింది..

బాలయ్య – బోయపాటి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు.. ‘అడిగా అడిగా’, ‘భం అఖండ’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జై బాలయ్య’ వీడియో సాంగ్ వదిలారు.

Unstoppable With NBK : బాలయ్య బాబు ఈజ్ బ్యాక్!

బాలయ్య క్లాస్ లుక్‌లో కనిపిస్తూనే ఊరమాస్ స్టెప్పులతో ఫ్యాన్స్‌ను అలరించారు. బాల్‌తో, కర్రతో వేసిన స్టెప్పులతో పాటు షర్టులు చేంజ్ అయ్యే షాట్స్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పాటకు థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. డిసెంబర్ 1 నుండి ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో ప్రీమియర్స్ పడబోతున్నాయి.