Akhanda Trailer : అరాచకం.. నటసింహా నట విశ్వరూపం..

‘అఖండ’ గా బాలయ్య సింహ గర్జన.. ఇప్పటివరకు ఇలా చూసుండరు..

Akhanda Trailer : అరాచకం.. నటసింహా నట విశ్వరూపం..

Akhanda Trailer

Updated On : November 15, 2021 / 11:05 AM IST

Akhanda Trailer: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు, రెండు లిరికల్ సాంగ్స్ అందర్నీ ఆకట్టుకోవడమే కాక సినిమా మీద అంచనాలను మరింత పెంచాయి. ఇక నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అఖండ’ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది.

Akhanda Trailer Roar పేరుతో వదిలిన 2:18 నిమిషాల ట్రైలర్ మామూలుగా లేదసలు.. బాలయ్యలోని నట విశ్వరూపాన్ని ఇప్పటివరకు ఇలా చూడలేదు.. ఇక ముందు చూస్తామో లేదో అనేంతగా బోయపాటి ప్రెజెంట్ చేశాడు. సింహంలా చెలరేగిపోయారు నటసింహా.

ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా.. శ్రీకాంత్, జగపతి బాబు కీలకపాత్రల్లో నటించారు. రెండు క్యారెక్టర్లకు సంబంధించిన బాలయ్య లుక్స్, గెటప్స్ అదిరిపోయాయి. ఇక విజువల్స్, ఆర్ఆర్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

‘ఒక మాట నువ్వు అంటే అది శబ్దం.. అదే మాట నేను అంటే అది శాసనం.. దైవ శాసనం.. బ్రేకుల్లేని బుల్డోజర్‌ని.. తొక్కి పారదొబ్బుతా.. మీకు సమస్యొస్తే దణ్ణం పెడతారు.. మేమా సమస్యకే పిండం పెడతాం’ వంటి డైలాగ్స్ అదిరిపోయాయి. డిసెంబర్ 2న థియేటర్లలో ‘అఖండ’ గా నటసింహా గర్జన స్టార్ట్ కాబోతోంది.