Akhil Agent Movie still in shooting producer tweet goes viral
Akhil Agent : అఖిల్ అక్కినేని మూడు సినిమాల తర్వాత నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మంచి విజయం సాధించాడు. మొదటి సినిమా తప్ప మిగిలిన మూడు సినిమాలు ప్రేమ కథలే. దీంతో యాక్షన్ హీరోగా మారాలనుకొని ఇప్పుడు ఫుల్ యాక్షన్ కథతో ఏజెంట్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. ఏజెంట్ సినిమా సురేందర్రెడ్డి దర్శకత్వంలో AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీగా తెరకెక్కుతుంది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఏజెంట్ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. సినిమా నుంచి ఓ పాట, టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ తెరకెక్కుతుంది. ఏజెంట్ సినిమాని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ కొత్త డేట్ ని కూడా ప్రకటించారు. అయితే ఇన్ని రోజులు షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుందేమో అని అనుకున్నారు అంతా.
తాజాగా నిర్మాత చేసిన ట్వీట్ కి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంకర.. మస్కట్ లో ఏజెంట్ సినిమాలోని యాక్షన్ సీన్స్ గ్రాండ్ గా షూట్ జరుగుతుంది. అఖిల్ బెంగుళూరులో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొనటానికి వెళ్ళాడు. చిన్న గ్యాప్. మళ్ళీ వచ్చేసి షూట్ లో పాల్గొంటాడు అని ట్వీట్ చేశాడు. ఇటీవల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రతి శనివారం, ఆదివారం మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు వారియర్స్ వి రెండు మ్యాచ్ లు జరగగా అఖిల్ వీటిల్లో ఆడి హాఫ్ సెంచరీలతో అదరగొట్టి విజయం తెచ్చిపెట్టాడు. నేడు జరగనున్న మ్యాచ్ లో ఆడటానికి ఏజెంట్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని మస్కట్ నుంచి బెంగుళూరుకి వచ్చినట్టు తెలుస్తుంది.
దీంతో అఖిల్ అభిమానులు ఇంకా షూటింగ్ అవ్వలేదా, ఇప్పుడు షూట్ అంటున్నారేంటి? ఏప్రిల్ లోనే రిలీజ్ కదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన అఖిల్ ఏజెంట్ సినిమా ఈ సారన్నా చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా లేదా చూడాలి మరి. అఖిల్ బాడీ పెంచి ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ సినిమాతో వస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
AGENT'S UPDATE : Action shoot going in full swing in Muscat. Agent#28 left to Bengaluru to entertain in CCL on Saturday. Agent merchandise coming soon.
— Anil Sunkara (@AnilSunkara1) March 3, 2023