Agent Movie Collections: ఏజెంట్ మూవీ ఫస్డ్ డే కలెక్షన్స్.. సింగిల్ డిజిట్‌కే పరిమితం..?
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ తొలి రోజున కేవలం రూ.7 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.

Akhil Akkineni Agent Movie First Day Collections Very Low
Agent Movie Collections: అక్కినేని అఖిల్ ఎంతో ప్రెస్టీజియస్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ భారీ అంచనాల మధ్య నిన్న(ఏప్రిల్ 28) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడంతో ఏజెంట్ మూవీతో అఖిల్ ఎంతగానో ఎదురుచూస్తున్న సక్సెస్ ఈసారి ఖచ్చితంగా వస్తుందని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కానీ, సినిమా రిలీజ్ రోజునే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Agent Movie: ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోన్న వైల్డ్ సాలా సాంగ్ ప్రోమో.. థియేటర్స్‌లో రచ్చరచ్చే!
ఏజెంట్ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ సినిమాను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. భారీ ప్రమోషన్స్ నిర్వహించిన ఈ సినిమా ఇలాంటి కథతో రావడంతో ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇక పబ్లిక్ టాక్ ఈ సినిమాకు కామన్ ఆడియెన్స్‌ను దూరం చేసింది. దీంతో ఈ సినిమాకు తొలిరోజు అంతంత మాత్రంగా వసూళ్లు వస్తాయని అందరూ అనుకున్నారు.
Agent Movie : సముద్రంలో ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ
కానీ, ఏజెంట్ మూవీకి దారుణమైన వసూళ్లు వచ్చినట్లుగా ఎర్లీ రిపోర్ట్స్ చూస్తే తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఏజెంట్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున కేవలం రూ.7 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అఫీషియల్‌గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే అఖిల్ కెరీర్‌లో ఏజెంట్ మూవీ కూడా దారుణమైన డిజాస్టర్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మమ్ముట్టీ ఓ కీలక పాత్రలో నటించగా, సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది.