Akhil Akkineni : ఇంకా ఏజెంట్ గెటప్‌లోనే అఖిల్.. కారణం ఏంటంటున్న నెటిజెన్స్..

అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ మూవీ వచ్చి వెళ్ళిపోయినా.. అఖిల్ మాత్రం ఇంకా అదే గెటప్ లో ఉన్నాడు.

Akhil Akkineni : ఇంకా ఏజెంట్ గెటప్‌లోనే అఖిల్.. కారణం ఏంటంటున్న నెటిజెన్స్..

Akhil Akkineni is still in Agent movie getup why

Updated On : September 20, 2023 / 6:30 PM IST

Akhil Akkineni : అక్కినేని వారసుడిగా ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన హీరో ‘అఖిల్’. హీరోగా లాంచ్ అవ్వడానికంటే ముందే ఇండస్ట్రీలో అభిమానులను సొంతం చేసుకున్న ఘనత అఖిల్‌కే సాధ్యమైంది. అయితే అఖిల్ తన సినిమాలతో ఆ అభిమానులను సంతృప్తి పరచలేకపోతున్నాడు. ‘అఖిల్’ మూవీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక ఆ తరువాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా.. అవికూడా సక్సెస్ అవ్వలేదు. 2021 లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఏదో పర్వాలేదు అనిపించింది.

Ram Charan : అప్పుడు నందమూరి.. ఇప్పుడు అక్కినేని అభిమానుల.. మనసు దోచుకుంటున్న రామ్ చరణ్..

ఇక ఈ ఏడాది ఎన్నో అంచనాలు మధ్య ‘ఏజెంట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి తీవ్ర నిరాశను మిగిల్చాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడం, స్పై యాక్షన్ జోనర్ కావడంతో మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మూవీ తీవ్రంగా నిరాశ పరిచింది. డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని అక్కినేని అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. భారీగా బాడీ పెంచి, ఎక్కువ జుట్టు-గడ్డంతో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు.

Venkaiah Naidu : రాజకీయ వారసత్వం v/s సినిమా వారసత్వం.. నెపోటిజం పై వెంకయ్య నాయుడు కామెంట్స్..

ఇంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని వెళ్ళిపోయినప్పటికీ.. అఖిల్ మాత్రం ఇంకా ఆ గెటప్ నుంచి బయటకి రాలేదు. తాజాగా ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఏజెంట్ గెటప్ లోనే కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంకా ఎందుకు అదే గెటప్ లో ఉన్నాడు అంటూ ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతుంది. అఖిల్ ఇప్పటి వరకు మరో సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఇక మరోపక్క ఏజెంట్ మూవీ కొన్న వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గొడవ కూడా పరిష్కారం అవ్వలేదు. ఇటీవల ఆ ఇష్యూ క్రిమినల్ కోర్ట్ వరకు వెళ్ళింది.