Akhil Akkineni : సమంత అంచనాలను అందుకుంటాను అంటున్న అఖిల్..

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా సమంత విషెస్ తెలియజేసింది. ఆ విషెస్ కి అఖిల్ రెస్పాండ్ అవుతూ పోస్ట్ పెట్టాడు.

Akhil Akkineni reacted to samantha birthday wishes post and agent movie

Akhil Akkineni : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమాలో నటిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. వేసవి సెలవుల్లో ఏప్రిల్ 28న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉంటే, నిన్న (ఏప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే సమంత (Samantha) కూడా అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

Samantha : అఖిల్‌కి సమంత బర్త్ డే విషెస్.. ఏమని చెప్పిందో తెలుసా?

ఏజెంట్ మూవీ పోస్టర్ ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ”హ్యాపీ బర్త్ డే అఖిల్. ఏజెంట్ కోసం ఎదురు చూస్తున్నా. లాట్స్ అఫ్ లవ్” అంటూ పోస్ట్ వేసింది. ఇక దీనికి అఖిల్ బదులిచ్చాడు. “థాంక్యూ సో మచ్ సామ్. నీ అంచనాలను నేను అందుకుంటాను” అంటూ రిప్లై ఇస్తూ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అక్కినేని మరియు సమంత అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకున్న తరువాత కూడా సమంత అక్కినేని కుటుంబంతో మంచి సంబంధాలు మెయిన్‌టైన్ చేయడం అందర్నీ ఆనంద పరుస్తుంది.

కాగా ఏజెంట్ మూవీతో అఖిల్ ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తో తన కల నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీతో పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సాక్షి వైద్య, అఖిల్ కి జంటగా కనిపించబోతుంది. హిప్ హాప్ తమిజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Akhil Akkineni reacted to samantha birthday wishes post and agent movie