Khushi: ఖుషి రీ-రిలీజ్.. దేవి థియేటర్‌లో సినిమా చూసిన అకీరా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఖుషి’ చిత్రాన్ని నేడు భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో అందాల భామ భూమికా హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తాజాగా రీ-రిలీజ్ చేయడంతో కుర్రకారు థియేటర్లకు క్యూ కట్టారు.

Akira Nandan Watches Pawan Kalyan Khushi Re-Release
Khushi: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఖుషి’ చిత్రాన్ని నేడు భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దర్శకుడు ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీలో అందాల భామ భూమికా హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తాజాగా రీ-రిలీజ్ చేయడంతో కుర్రకారు థియేటర్లకు క్యూ కట్టారు.
Khushi : ఖుషి రీ రిలీజ్‌కి థియేటర్లు లేవు.. నిరాశలో ఫ్యాన్స్!
పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కామన్ ఆడియెన్స్ కూడా మరోసారి ఈ సినిమాను థియేటర్స్‌లో చూడాలని భారీగా వచ్చారు. దీంతో ఈ సినిమా ప్రదర్శించిన అన్ని థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. అయితే పవన్ ‘ఖుషి’ సినిమాను ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా థియేటర్‌లో వీక్షించాడు. హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో అకీరా ఖుషి రీ-రిలీజ్‌ను అభిమానుల మధ్య కూర్చుని ఎంజాయ్ చేశాడు.
Khushi: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఖుషి టికెట్లు!
సినిమాలోని సీన్స్, సాంగ్స్‌కు ప్రేక్షకులు కేకలతో థియేటర్ టాప్ లేపారు. ఖుషి సినిమాకు ఇన్నాళ్ల తరువాత కూడా ఈ రేంజ్‌లో రెస్పాన్స్‌ను చూసి అకీరా షాక్‌కు గురయ్యాడు. ఇలాంటి క్లాసిక్ మూవీని ఎప్పుడు రీ-రిలీజ్ చేసినా, అభిమానులు ఇలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఖుషి రీ-రిలీజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
#AkiraNandan At Devi70MM ? #Kushi4KCelebrations @PawanKalyan pic.twitter.com/p74bGg7yoP
— PK Nithiin Fans (@PKNithiin_FC) December 31, 2022