Akkineni Akhil next movie also with high budget in UV Creations
Akkineni Akhil : అక్కినేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు ఒక్క పెద్ద హిట్ కూడా అందుకోలేదు. మధ్యలో వచ్చినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది. ఇటీవల ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా, సాక్షి వైద్య హీరోయిన్ గా మమ్ముట్టి ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ఏజెంట్. దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతలకు భారీ నష్టం చేకూరింది. అసలు మార్కెట్ లేని హీరో మీద అంత బడ్జెట్ పెట్టడమే ఎక్కువ అనుకుంటే కథ, కథనం సరిగ్గా లేని సినిమాని తీశారు. సినిమాపై అభిమానులు కూడా విమర్శలు చేశారు. సినిమా భారీ పరాజయం పాలవ్వడంతో నిర్మాత అనిల్ సుంకర స్వయంగా సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకుంటూ సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్ళాం అని ప్రకటించడంతో అక్కినేని అభిమానులు ఫైర్ అయ్యారు.
ఏజెంట్ సినిమా అంత భారీ ఫ్లాప్ చూసిన తర్వాత అఖిల్ నెక్స్ట్ ఏ సినిమాతో వస్తాడో అని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే అఖిల్ నెక్స్ట్ సినిమా UV క్రియేషన్స్ లో ఉందని సమాచారం. అయితే తాజాగా అఖిల్ నెక్స్ట్ సినిమా కూడా భారీ బడ్జెట్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా UV క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ అయినా, అఖిల్ కి మార్కెట్ లేకపోయినా మళ్ళీ భారీ బడ్జెట్ సినిమా తీస్తుండటంతో కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి చూడాలి అఖిల్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో.
Mega Budget film #Dheera
Starring Akhil Akkineni, Jhanvi Kapoor.
Direction – Anil Kumar (Debutant)
Production – UV Creations:
— Christopher Kanagaraj (@Chrissuccess) June 27, 2023