YVS Chowdary : నేను ఎన్టీఆర్ వీరాభిమాని అని తెలిసినా కూడా నాగార్జున అవకాశం ఇచ్చారు.. YVS చౌదరి మొదటి సినిమాకు 25 ఏళ్ళు..
ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నా సినీ పరిశ్రమలోనే ఉన్నారు వైవీఎస్ చౌదరి. తాజాగా ఆయన మొదటి సినిమా రిలీజయి 25 ఏళ్ళు పూర్తి అయిన సందర్భాంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

YVS Chowdary first movie completed 25 years says thanks to Nagarjuna
Nagarjuna : వైవీఎస్ చౌదరి(YVS Chowdary) దర్శకుడిగా ఒకప్పుడు ఎన్నో మంచి సినిమాలను అందించారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆ తర్వాత ఒక్కమొగాడు, సలీం, రేయ్ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. ఒక్కమొగుడు, నిప్పు, రేయ్ సినిమాలకు నిర్మాతగా కూడా పనిచేసి భారీ నష్టాల్లో మునిగిపోయాడు వైవీఎస్ చౌదరి. దీంతో రేయ్ తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నా సినీ పరిశ్రమలోనే ఉన్నారు వైవీఎస్ చౌదరి. తాజాగా ఆయన మొదటి సినిమా రిలీజయి 25 ఏళ్ళు పూర్తి అయిన సందర్భాంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వైవీఎస్ చౌదరి 1998లో శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారాడు. జూన్ 26న ఈ సినిమా రిలీజయింది. వెంకట్, చాందిని జంటగా అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. నాగార్జున ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Salaar Movie : ప్రభాస్ ‘సలార్’ సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పీరెన్స్?
తాజాగా వైవీఎస్ చౌదరి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. నా మొదటి సినిమా రిలీజయి 25 ఏళ్ళు అయింది. నా గురువు రాఘవేంద్రరావు గారికి, నేను దర్శకత్వ శాఖలో పనిచేసిన నా డైరెక్టర్స్ ఆర్జీవీ, ఉపేంద్ర, సింగీతం శ్రీనివాసరావు, కృష్ణవంశీ గార్లకు, నా తల్లితండ్రులకు, సినిమా వైపు నన్ను నడిపించిన ఎన్టీఆర్ గారికి, ఈ కెరీర్ లో నాకు సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. నా మొదటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాగార్జున గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అని తెలిసినా కూడా నాకు దర్శకుడిగా తొలి సినిమా అవకాశం ఇచ్చారు. నాకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన నాగార్జున గారి ఋణం తీర్చుకోలేనిది. నా మొదటి సినిమాలోనే ఏఎన్నార్ గారిని నటించేలా చేసే అవకాశం కూడా వచ్చింది. నాగార్జున గారు, ఆయన కుటుంబం మంచితనం వల్లే నేను ఇక్కడున్నాను అని తెలిపారు.