Salaar Movie : ప్రభాస్ ‘సలార్’ సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పీరెన్స్?

సలార్ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

Salaar Movie : ప్రభాస్ ‘సలార్’ సినిమాలో మరో హీరో గెస్ట్ అప్పీరెన్స్?

Rishab Shetty guest appearance in Prabhas Salaar Movie talk goes viral

Updated On : June 27, 2023 / 8:19 AM IST

Prabhas :  ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గ్రాండ్ గా తెరకెక్కుతున్న సినిమా సలార్(Salaar). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రియారెడ్డి, జగపతి బాబు, మళయాలం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇలా అనేకమంది స్టార్స్ నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాలో కన్నడ హీరో రక్షిత్ శెట్టి గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడని సమాచారం. రక్షిత్ ఇటీవలే 777 చార్లీ సినిమాతో కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించాడు. సలార్ సినిమాలో రక్షిత్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉన్నా అధికారిక ప్రకటన లేదు. ఇదే నిజమైతే సినిమాపై మరిన్ని హోప్స్ పెరుగుతాయి అని అభిమానులు అంటున్నారు.

Vijay : ఆంధ్రప్రదేశ్‌లో విజయ్ లియో షూటింగ్.. ఎక్కడో తెలుసా?

ప్రభాస్ వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డీలా పడటంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. దీంతో అభిమానులంతా సలార్ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమా సెప్టెంబర్ 28 రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు.