Akkineni Family : వరద బాధితులకు భారీ విరాళం ప్ర‌క‌టించిన అక్కినేని కుటుంబం.. ఎంతంటే?

ఇటీవల కురిసిన వర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది.

Akkineni Family : వరద బాధితులకు భారీ విరాళం ప్ర‌క‌టించిన అక్కినేని కుటుంబం.. ఎంతంటే?

Akkineni Family and group companies announced one crore for Telugu states

Updated On : September 4, 2024 / 3:43 PM IST

Akkineni Family : ఇటీవల కురిసిన వర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఒక్కొక్క‌రిగా విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. తాజ‌గా అక్కినేని కుటుంబం కూడా త‌మ వంతు విరాళాన్ని ప్ర‌క‌టించింది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.కోటి విరాళంగా ఇస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

‘ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల‌ సహాయ నిధికి చెరో యాభై లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం.’ అని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Naga Manikanta : నాన్న చనిపోయాడు.. అమ్మ శవం కాల్చడానికి డబ్బులు అడుక్కున్నా.. బిగ్ బాస్‌లో ఏడ్చేసిన నాగమణికంఠ..

విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ డొనేషన్ ని అందజేస్తున్నాయి

ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి ఇప్ప‌టికే ప్ర‌భాస్ రూ.రెండు కోట్లు, చిరంజీవి రూ.కోటి, బాలకృష్ణ రూ.కోటి, అల్లు అర్జున్ రూ.కోటీ, మహేశ్‌బాబు రూ.కోటి, ఎన్టీఆర్‌ రూ.కోటి, సిద్ధూ జొన్నల గడ్డ రూ.30 లక్షలు, విష్వక్‌సేన్‌ రూ.10 లక్షలు, వెంకీ అట్లూరి రూ.10 లక్షలు, అనన్య నాగళ్ల రూ.2.5లక్షలు విరాళంగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Nikhil Siddhartha : హీరో నిఖిల్ క్యూట్ ఫ్యామిలీ ఫోటో వైరల్.. భార్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి..