Naga Manikanta : నాన్న చనిపోయాడు.. అమ్మ శవం కాల్చడానికి డబ్బులు అడుక్కున్నా.. బిగ్ బాస్‌లో ఏడ్చేసిన నాగమణికంఠ..
నాగ మణికంఠ ఎమోషనల్ అయి తన బాధలు అన్ని చెప్పుకొచ్చాడు.
Naga Manikanta : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదటి రోజు నుంచే గొడవలతో సాగుతుంది. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుండటంతో ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. అయితే అందరిలో సైలెంట్ గా ఉండటంతో చాలా మంది కంటెస్టెంట్స్ నాగ మణికంఠని కార్నర్ చేసారు. నిన్నటి ఎపిసోడ్ లో కొన్ని నామినేషన్స్ జరగ్గా ఇవాళ ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ జరగనున్నాయి.
తాజాగా నేడు టెలికాస్ట్ అవ్వనున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ప్రోమో అంతా ఒకరిపై ఒకరు ఫైర్ అవ్వడంతోనే సాగింది. అలాగే పలువురు కంటెస్టెంట్స్ నాగమణికంఠని కార్నర్ చేసి, అతన్నే నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో నాగ మణికంఠ ఎమోషనల్ అయి తన బాధలు అన్ని చెప్పుకొచ్చాడు.
Also Read : Mega 3D Paint : ఒకే పెయింట్‌లో ముగ్గురు మెగా హీరోలు.. ఈ మెగా 3D పెయింటింగ్ చూసారా? ఆశ్చర్యపోవాల్సిందే..
నాగమణికంఠ మాట్లాడుతూ.. చావు దాకా వెళ్లి వచ్చాను. మీకేం తెలియదు నా గురించి. కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. పెంపుడు తండ్రితో అవమానాలు పడ్డాను. అమ్మ చచ్చిపోయింది. అమ్మ శవం కాల్చడానికి కట్టెల కోసం డబ్బులు అడుక్కొని వచ్చి శవం కాల్చాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశాడు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
నాగమణికంఠ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో తన కెరీర్ కి హెల్ప్ అవుతుందని హౌస్ లోకి వచ్చాడు. మరి ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో తెలియాలంటే ఇవాళ టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ చూడాల్సిందే.