Nikhil Siddhartha : హీరో నిఖిల్ క్యూట్ ఫ్యామిలీ ఫోటో వైరల్.. భార్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి..

నిఖిల్ భార్య పల్లవి పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే భార్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసాడు.

Nikhil Siddhartha : హీరో నిఖిల్ క్యూట్ ఫ్యామిలీ ఫోటో వైరల్.. భార్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి..

Nikhil Siddhartha Celebrate his Wife Birthday and Shares Photos with Family

Updated On : September 4, 2024 / 8:24 AM IST

Nikhil Siddhartha : హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి పాన్ ఇండియా హీరో అవ్వడంతో పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో స్వయంభు సినిమాతో రానున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా నిఖిల్ యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. తాజాగా నిఖిల్ తన ఫ్యామిలీ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Also Read : Tollywood Donations : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. సినీ ప్రముఖుల భారీ విరాళాలు.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..?

నిఖిల్ భార్య పల్లవి పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే భార్య పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసాడు. తన భార్య పల్లవి, కొడుకు ధీరలతో పాటు తన తల్లితో కలిసి దిగిన ఫోటోలని నిఖిల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి.. హ్యాపీ బర్త్ డే టు స్వీటెస్ట్ ఏంజిల్ పల్లవి వర్మ. నేను నీ వల్లే ఉన్నాను. ఇద్దరం కలిసి మరిన్ని జ్ఞాపకాలు, సంతోషంతో ఉందాం. ఈ సంవత్సరం నీ బర్త్ డే కి గిఫ్ట్ ధీర అంటూ పోస్ట్ చేసాడు నిఖిల్.

దీంతో నిఖిల్ పోస్ట్ వైరల్ గా మారగా క్యూట్ ఫ్యామిలీ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నిఖిల్ భార్యకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.