అక్కినేని హీరోల ఆర్ధికసాయం..

కరోనా ఎఫెక్ట్ : రోజు వారీ సినీ కార్మికుల కోసం నాగార్జున, నాగ చైతన్య విరాళం..

  • Published By: sekhar ,Published On : March 28, 2020 / 03:52 PM IST
అక్కినేని హీరోల ఆర్ధికసాయం..

Updated On : March 28, 2020 / 3:52 PM IST

కరోనా ఎఫెక్ట్ : రోజు వారీ సినీ కార్మికుల కోసం నాగార్జున, నాగ చైతన్య విరాళం..

21 రోజుల లాక్ డౌన్ వలన సినిమా షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం తన వంతు బాధ్యతగా కింగ్ నాగార్జున కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.
సినిమా షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న రోజు వారీ సినీ కార్మికుల కోసం కింగ్ నాగార్జున కోటి రూపాయల విరాళం ఇస్తూ.. ఈ లాక్ డౌన్ మనకి అత్యంత అవసరం అని, అందరూ ఇంటిలోనే ఉండి విధిగా దాన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

అలాగే యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కూడా తనవంతుగా 25లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ  కార్మికుల సంక్షేమం కోసం 25లక్షల రూపాయల విరాళమందిస్తున్నానని.. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు చైతు..