Mission Raniganj : ఆస్కార్‌కి అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ మూవీ..?

అక్షయ్ కుమార్ 'మిషన్ రాణిగంజ్' ఆస్కార్స్ కి వెళ్ళడానికి సిద్దమయ్యినట్లు బి-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి RRR ని..

Mission Raniganj : ఆస్కార్‌కి అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ మూవీ..?

Akshay Kumar Mission Raniganj is went to oscar in independently

Updated On : October 13, 2023 / 6:05 PM IST

Mission Raniganj : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ మూవీ ‘మిషన్ రాణిగంజ్’. 1989లో వెస్ట్ బెంగాల్ రాణిగంజ్ బొగ్గు గనుల్లో 65 మంది చిక్కుపోయారు. వారందర్ని కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జస్వంత్ సింగ్ పాత్రని అక్షయ్ పోషించాడు. అక్టోబర్ 6న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో పెద్దగా సత్తా చాటలేకపోతుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్స్ కి వెళ్ళడానికి సిద్దమయ్యినట్లు బి-టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : Jawan Collections : ఇంకా కొనసాగుతున్న జవాన్ కలెక్షన్స్ జోరు.. 1200 కోట్ల టార్గెట్..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఇక్కడ నిర్మాతలకు ఒక కొత్త దారి చూపించాడు. ఒకప్పుడు ఆస్కార్ కి వెళ్లాలంటే ప్రభుత్వం అధికారికంగా పంపించాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు అన్నట్లు ఉండేది. కానీ రాజమౌళి RRR ని ఇండిపెండెంట్ గా ఆస్కార్ కి తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు ఇదే దారిని మిషన్ రాణిగంజ్ మూవీ టీం కూడా అనుసరిస్తుందట. ఆల్రెడీ ఈ సినిమాని ఆస్కార్స్ కి సబ్మిట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ప్రభుత్వం తరుపు నుంచి ఆస్కార్స్‌కి.. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘2018’ని పంపించారు.

Also read : The Vaccine War : ఆస్కార్‌కి ‘ది వ్యాక్సిన్ వార్‌’ సినిమా.. శాశ్వత స్థానం దక్కించుకుంది..

ఇక ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ ‘ది వ్యాక్సిన్ వార్’ స్క్రిప్ట్ ఆస్కార్ లైబ్రరీలో శాశ్వత స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ మూవీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలియజేశాడు. ఇప్పుడు ఆస్కార్స్ కి వెళ్లిన 2018, మిషన్ రాణిగంజ్.. రెండు సినిమాలు సర్వైవల్ డ్రామాలు. రెండు చిత్రాలు గతంలో వచ్చిన విపత్తులు పై తెరకెక్కిన సినిమాలే. మరి ఈ ఏడాది ఆస్కార్ ని ఈ సినిమాలు దక్కించుకుంటాయా లేదా అనేది చూడాలి.