Akshay Kumar : అక్షయ్ కుమార్ కొత్త సినిమా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కానుందా.. రీజన్ అదేనా?
ఇటీవల అక్షయ్ కుమార్ ఎన్నో ఆశలు పెట్టుకొని సౌత్ సూపర్ హిట్ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్'ని రీమేక్ చేసి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రస్తుతం ఈ హీరో..

Akshay Kumar omg 2 will be released in direct ott?
Akshay Kumar : బాలీవుడ్ బడా హీరోలు అందరికి గత కొంత కాలంగా బ్యాడ్ టైం నడుస్తుంది. ఇటీవలే షారుఖ్ ఖాన్ దీని నుంచి కోలుకోగా, మిగిలిన హీరోలు మాత్రం బయట పడలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ 2021 నుంచి 8 సినిమాలు తీసినా ఒక్కటి హిట్టు అందించలేక పోయింది. ఇటీవల ఎన్నో ఆశలు పెట్టుకొని సౌత్ సూపర్ హిట్ సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ని రీమేక్ చేసి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
Akshay Kumar : అక్షయ్ కుమార్ కి ఏమైంది.. వరుస ఫ్లాప్స్.. ఓపెనింగ్స్ కూడా రావట్లేదు
ప్రస్తుతం ఈ హీరో చేతిలో మరో 8 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. ఆ సినిమానే OMG-2. 2012 లో అక్షయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ OMG సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ చేశారు. మొదటి భాగంలో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్. ఈ సీక్వెల్ లో శివుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
పోస్టర్ బట్టి చూస్తే.. ఈ సినిమాలో శివుడి, ఒక పిల్లవాడి మధ్య కథ నడవనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమాని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమయ్యినట్లు సమాచారం. అక్షయ్ మునపటి సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ఫెయిల్ అవ్వడమే కాకుండా ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక పోయాయి. దీంతో మేకర్స్ రిస్క్ తీసుకోకుండా ఓటిటి రిలీజ్ చేయడానికి ఇష్ట పడుతున్నట్లు బాలీవుడ్ లో వినిపిస్తుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలి అంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే.