Twinkle Khanna : మాస్టర్స్ డిగ్రీ పూర్తి హీరోయిన్‌పై అక్షయ్ కుమార్ ప్రశంసలు.. తెలుగులో ఆ హీరో పక్కన..
చదువుకి వయసు అడ్డంకి కాదని నిరూపించారు బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా. తాజాగా లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

Twinkle Khanna
Twinkle Khanna : బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఆమె భర్త బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
Akshay Kumar Indian citizenship : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం
బాలీవుడ్ కపుల్ అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాలను చాలామంది అభిమానిస్తారు. ట్వింకిల్ ఖన్నా అప్పట్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించినా 2001 లో అక్షయ్‌ని పెళ్లాడాక స్క్రీన్‌కి దూరమయ్యారు. రీసెంట్‌గా చదువుపట్ల ఆసక్తితో లండన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారామె. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (twinklerkhanna) షేర్ చేసుకున్నారు. వీడియోలో తన అనుభవాల్ని చెబుతూ చదువుకి వయసు అడ్డంకి కాదని అన్ని విధాలుగా ఎదగాలని ఎంచుకుంటే అందులో ఇది ఒక భాగమని చెప్పుకొచ్చారు. ట్వింకిల్ పోస్టుపై అక్షయ్ కుమార్ స్పందించారు. “ఇందులో నైపుణ్యం సాధించారు .. టీనా మీ గురించి చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు?” అంటూ అక్షయ్ రిప్లై చేశారు.
NTR : ఆ పాత్రకు న్యాయం చేయగల నటుడు ఒక ఎన్టీఆర్ మాత్రమే.. బాలీవుడ్ దర్శకుడు..!
ట్వింకిల్ ఖన్నాపై నెటిజన్లు అభినందనలు కురిపించారు. హార్ట్ ఎమోజీలతో స్పందించారు. త్వరలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేయమని సూచించారు.
View this post on Instagram