Akshay Kumar : మాట తప్పలేదు.. పాన్ మసాలా యాడ్‌పై అక్షయ్ కుమార్ కౌంటర్ ట్వీట్..

గతంలో పాన్ మసాలా యాడ్ లో నటించను అని చెప్పిన అక్షయ్.. రీసెంట్ గా మళ్ళీ అదే యాడ్ తో వచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ విషయం గురించి..

Akshay Kumar : మాట తప్పలేదు.. పాన్ మసాలా యాడ్‌పై అక్షయ్ కుమార్ కౌంటర్ ట్వీట్..

Akshay Kumar tweet on Vimal Elaichi new ad video

Updated On : October 10, 2023 / 2:20 PM IST

Akshay Kumar : తన సినిమాలతో ఆడియన్స్ కి మెసేజ్ లు ఇచ్చే అక్షయ్ కుమార్.. గతంలో పాన్ మసాలా యాడ్ లో నటించి ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకున్నాడు. దీంతో అప్పుడు ఒక క్షమాపణ లెటర్ చేస్తూ.. “నేను ఆ యాడ్ నుంచి నేను వెనక్కి తగ్గుతున్నాను. భవిషత్తులో కూడా అలాంటి యాడ్స్ చేయకుండా జాగ్రత్తగా ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను” అంటూ మాటిచ్చాడు. అయితే తాజాగా కొత్త పాన్ మసాలా యాడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో అక్షయ్ మళ్ళీ కనిపించాడు.

ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ‘గతంలో చేయను అని మాటిచ్చి, ఇప్పుడు మళ్ళీ ఆ యాడ్ లో నటించి అక్షయ్ తన మాట నిలబెట్టుకోలేకపోయాడు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక దీని గురించి నెటిజెన్స్ అక్షయ్ ని తీవ్రంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అలాగే పలు మీడియా వెబ్ సైట్స్ కూడా అక్షయ్ పై విమర్శలు చేస్తూ ఆర్టికల్స్ రాశాయి. ఇటీవలే అక్షయ్ కి భారతదేశ పౌరసత్వం వచ్చింది. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఒక బాలీవుడ్ మీడియా.. “అక్షయ్ పాన్ మసాలా యాడ్ తో ఇండియన్ అంబాసడర్ గా తిరిగి వచ్చాడా?” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Also read : Vijay Antony : కూతురి మరణంపై విజయ్ ఆంటోనీ భార్య ఎమోషనల్ ట్వీట్.. నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని.. 

ఈ ట్వీట్ పై అక్షయ్ రియాక్ట్ అయ్యాడు. “నిజం తెలుసుకొని మాట్లాడండి. ఆ యాడ్ 2021 అక్టోబర్ 13న షూట్ చేసింది. నేను అలాంటి యాడ్స్ చేయను అని చెప్పిన తరువాత ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకోలేదు. ఆల్రెడీ షూట్ చేసిన యాడ్ ని ఆ బ్రాండ్ వాళ్ళు లీగల్ గా రన్ చేసుకుంటున్నారు. వచ్చే నెలాఖరు వరకు ఆ యాడ్ ని రన్ చేసుకొనే అవకాశం వాళ్ళకి ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అక్షయ్, పాన్ మసాలా యాడ్ వార్తలకు ఒక చెక్ పడినట్లు అయ్యింది.