Bell Bottom: అక్షయ్ కుమార్ ‘Throwback 80s’

  • Published By: sekhar ,Published On : October 5, 2020 / 02:47 PM IST
Bell Bottom: అక్షయ్ కుమార్ ‘Throwback 80s’

Updated On : October 5, 2020 / 2:56 PM IST

Akshay Kumar – Bell Bottom: కరోనా ప్రభావంతో ఆరు నెలల పాటు షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతలు ఇవ్వగానే ముందుగా విదేశాలకు వెళ్లిన హీరో అక్షయ్‌ కుమార్‌.


అక్షయ్ హీరోగా రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అద్వానీ నిర్మించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. వాణీ కపూర్‌, లారాదత్తా, హూమాఖురేషి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది.


ఇందులో అక్షయ్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. pandemic సమయంలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2, 2021లో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ‘బెల్ బాటమ్’ సినిమా టీజర్‌ను అక్షయ్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ కు తగ్గట్లు అక్షయ్ పలు గెటప్స్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు..

https://www.instagram.com/p/CF82fY0Hb4L/?utm_source=ig_web_copy_link