Nani: బర్త్‌డే గిఫ్ట్‌ను పట్టుకొస్తున్న నాని.. అలా సందడి మొదలుకానుంది!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Nani: బర్త్‌డే గిఫ్ట్‌ను పట్టుకొస్తున్న నాని.. అలా సందడి మొదలుకానుంది!

Ala Modalaindi Re-Release On Nani Birthday

Updated On : February 22, 2023 / 7:11 AM IST

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే నాని పుట్టినరోజు ఫిబ్రవరి 24న జరుపుకుంటుండటంతో, బర్త్ డే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో.

Nani: అంటే.. మళ్లీ ఆ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన నాని..?

నాని కెరీర్‌లో మంచి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘అలా మొదలైంది’ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో మనం చూశాం. ఈ సినిమాను డైరెక్టర్ నందినిరెడ్డి డైరెక్ట్ చేయగా, అందాల భామ నిత్యా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నాని పుట్టినరోజు కానుకగా ఫిబ్రవరి 24న ఈ సినిమా ప్రత్యేక షోలు వేయబోతున్నారు.

Nani30 : Nani30 లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఈమేరకు చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేసింది. మరి థియేటర్లలో మరోసారి సందడి చేయనున్న నాని మూవీ ఈసారి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.