కర్ణాటక, కేరళలో అల.. విజయోత్సవ వేడుక!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల... వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్..

  • Published By: sekhar ,Published On : January 18, 2020 / 06:53 AM IST
కర్ణాటక, కేరళలో అల.. విజయోత్సవ వేడుక!

Updated On : January 18, 2020 / 6:53 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల… వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది.

Image

కేవలం అయిదు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టడమే కాక పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పడం విశేషం. సినిమాను ఇంతటి ఘనవిజయం చేసినందుకు తమ ఆనందాన్ని ప్రేక్షకులతో కలిసి పంచుకోవడానికి మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. ఈ నెల 19న వైజాగ్ ఆర్‌కె బీచ్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Image

తర్వాత తిరుపతిలోనూ సక్సెస్ సెలబ్రేషన్ చేయనున్నారు. తర్వాత బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కేరళచ కర్ణాటక రాష్ట్రాల్లోనూ అల వైకుంఠపురం టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వీకెండ్‌లో అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద మరింతగా సత్తా చాటే అవకాశం ఉంది.

Image