Ala Vaikunthapurramuloo:అల వైకుంఠపురం మ్యూజిక్ కన్సర్ట్..ట్రైలర్ వచ్చేసింది

అల వైకుంఠపురం సినిమా మ్యూజిక్ కన్సర్ట్ సందడి సందడిగా కొనసాగుతోంది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది చిత్ర యూనిట్. చీఫ్

Ala Vaikunthapurramuloo:అల వైకుంఠపురం మ్యూజిక్ కన్సర్ట్..ట్రైలర్ వచ్చేసింది

Ala Vaikunthapurramuloo

Updated On : February 24, 2022 / 10:55 AM IST

Ala Vaikunthapurramuloo:అల వైకుంఠపురం సినిమా మ్యూజిక్ కన్సర్ట్ సందడి సందడిగా కొనసాగుతోంది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది చిత్ర యూనిట్. చీఫ్ గెస్ట్‌గా ఎవరినీ పిలవకపోవడం విశేషం. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ చెప్పగా అల్లు అరవింద్, రాధాకృష్ణలు లాంఛ్ చేశారు.

సినిమాకు సంబంధించిన సాంగ్స్‌ను లైవ్ మ్యూజిక్ ద్వారా ప్లే చేశారు. ప్రియా సిస్టర్స్ పాడిన పాటకు మంచి స్పందన వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ మ్యూజిక్ చేస్తున్నారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్, పూజా హెగ్డే, సీనియర్ హీరోయిన్ టబు, ఇతర నటీ నటులు పాల్గొన్నారు.

అలా వైకుంఠపురం సినిమాకు సంబంధించి ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదనే సంగతి తెలిసిందే. కానీ ఆన్ లైన్ పాటలు విడుదలై రచ్చ రచ్చ చేస్తున్నాయి. కొన్ని పాటలైతే రికార్డులు సృష్టించాయి. 2020, జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా విడుదల కానుంది.

రాజేంద్ర ప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సుమద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్దన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, షమ్మి సాయి తదితరులు నటించారు.
ఫైట్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ

Read More : అమ్మఒడి : 300 యూనిట్లకు పైబడి ఉంటే పథకం వర్తించదు