Manyavar Kanyadaan: అలియా యాడ్ దుమారం.. బాయ్‌కాట్ ‘మన్యవర్’ ట్రెండ్స్!
ఈ మధ్య కాలంలో సినిమాలలో సన్నివేశాలు, పాటలు, సంభాషణలు వివాదాస్పదమవడం తరచుగా జరుగుతూ వస్తుంది. కాగా, అప్పుడప్పుడూ నిమిషం నిడివి కూడా ఉండని యాడ్స్ సైతం వివాదాస్సదం అవుతుంటాయి.

Manyavar Kanyadaan
Manyavar Kanyadaan: ఈ మధ్య కాలంలో సినిమాలలో సన్నివేశాలు, పాటలు, సంభాషణలు వివాదాస్పదమవడం తరచుగా జరుగుతూ వస్తుంది. కాగా, అప్పుడప్పుడూ నిమిషం నిడివి కూడా ఉండని యాడ్స్ సైతం వివాదాస్సదం అవుతుంటాయి. అదే జరిగింది తాజాగా ఆలియా భట్ నటించిన క్లాథింగ్ బ్రాండ్ మాన్యవార్-మోహే అడ్వర్టైజ్మెంట్ విషయంలో కూడా. అలియా ఒక ప్రముఖ నగలు, వస్త్రాల బ్రాండ్ మాన్యవార్ కి ప్రచారకర్తగా వ్యవహరించగా.. సదరు కంపెనీ ఈ మధ్యే ఓ యాడ్‌ను జనాల్లోకి వదిలింది.
Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్
ఈ యాడ్‌లో అలియా హిందూ సంప్రదాయంలో జరిగే వేడుకలో కన్యాదానాన్ని తప్పు పడుతుండటం సమస్యగా మారింది. హిందువులు అమ్మాయిలను భారంగా చూస్తారనీ, పెళ్లితో ఆ భారం తొలగిపోయినట్లు భావిస్తారన్న కోణంలో ఈ యాడ్ ఉంది. ఈ యాడ్‌లో కన్యాదానాన్ని అలియాభట్ ప్రశ్నించగా ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఎందుకని ప్రశ్న వేసింది. అమ్మాయిలు ఆస్తులు కాదు అంటూ ఈ యాడ్‌ని ముగించారు.
Love Story: ఇంటెన్స్ లవ్.. ఫీల్‌గుడ్ రొమాన్స్‌తో లవ్ స్టోరీ!
కన్యాదాన కార్యక్రమంలో వరుడి తల్లిదండ్రులు కూడా పాల్గొని… కన్యా మాన్ జరిపించాలని అలియాభట్ కోరింది. తద్వారా కూతురును దానం చేస్తున్నామని కాకుండా.. ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుందని తెలిపింది. మొత్తంగా ఈ యాడ్… అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఆచారాల్లో తేడాలు చూపిస్తున్నారనీ.. మోడ్రన్ ఇండియాలో కూడా అమ్మాయిలను తక్కువ చేస్తున్నారని చెబుతోంది. అందులో హిందూ వివాహ క్రతువులో ఎంతో ప్రాముఖ్యత ఉన్న కన్యాదానాన్ని కన్యామాన్ గా మార్చేయడం వివాదాస్పదంగా మారింది.
Shyam Singha Roy: నాని జై అంటున్న ఓటీటీ.. నెట్ ఫ్లిక్స్‌కు శ్యామ్?
ఈ యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో బ్రాండ్ మాన్యవార్, అందులో నటించిన అలియాను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. హిందు సంప్రదాయాల్ని మంటకలుపుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కన్యాదానం అసలు ఉద్దేశం తెలియకుండా ఇష్టమొచ్చినట్లు యాడ్ చేశారని మండిపడుతున్నారు. బోయికాట్ మాన్యవర్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో దుమ్ముదులిపేస్తున్నారు. హిందూ వాదులు ఈ యాడ్ పై తీవ్రంగా మండిపడుతున్నారు.
Charity is considered the best in Hindu Dharma !!
Similarly, Kanyadan is considered as the best Charity in #Hinduism !
? But some heretics are differentiating these orthodox traditions ..!#Boycott_Manyavar pic.twitter.com/IRVV4ZVz3Q
— Mrunali Dharme (@mrunali_dharme) September 22, 2021
First of all understand our culture, tradition & beliefs and the reason behind "Kanyadan". Stop making such nonsense ads which harms our religious sentiments.#Boycott_Manyavar …..?️ pic.twitter.com/wB0XMxZs6N
— ?????? ???????. (@akshaygoswami_) September 22, 2021
Dear @Manyavar_ Once contact @TanishqJewelry and ask them what is a boycott…!
Never play with the feelings of Hindus, it will be very expensive!
I repeat never pic.twitter.com/JJ3j1ZoSzX
— Rupesh Gurav (@RupeshG96982026) September 22, 2021