Alia Bhatt : అలియాభట్ 30వ బర్త్‌డే కేక్ చూశారా?

మార్చ్ 15 అలియా భట్ పుట్టినరోజు. ఈ సారి తన 30వ పుట్టిన రోజు కావడంతో, ప్రస్తుతం ఇంట్లోనే ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్ తోనే తన 30వ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే తన 30వ బర్త్ డే కేకు ఇప్పుడు.............

Alia Bhatt : అలియాభట్ 30వ బర్త్‌డే కేక్ చూశారా?

Alia Bhatt 30th birthday special cake goes viral

Updated On : March 16, 2023 / 7:00 AM IST

Alia Bhatt :  బాలీవుడ్ భామ అలియాభట్ తన 30వ బర్త్ డేని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకుంది. రణబీర్ కపూర్ తో పెళ్ళి, కూతురు పుట్టడంతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో గడిపింది అలియా. త్వరలోనే మళ్ళీ షూటింగ్స్ కి వెళ్లనుంది. ఇప్పటికే పలు ఈవెంట్స్, సినిమా ఫంక్షన్స్ కి హాజరవుతుంది అలియా. మరోవైపు ఇంటిదగ్గర కూతురుతో సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.

మార్చ్ 15 అలియా భట్ పుట్టినరోజు. ఈ సారి తన 30వ పుట్టిన రోజు కావడంతో, ప్రస్తుతం ఇంట్లోనే ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్ తోనే తన 30వ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే తన 30వ బర్త్ డే కేకు ఇప్పుడు వైరల్ గా మారింది. 3,0 నంబర్స్ తో కేక్ మీద మొత్తం స్ట్రాబెర్రీ, ద్రాక్ష, చెర్రీ.. లాంటి ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారు. చాకోలెట్ ఫ్లేవర్ కేక్ పై ఇలా ఫ్రూట్స్, కొన్ని ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు.

Rangamarthanda : ఉగాదికి కృష్ణవంశీ రంగమార్తాండ.. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్..

అలియా ఆ కేక్ ని చూసి దండం పెడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల మధ్యే తన 30వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది అలియా. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Image