‘క్రాక్’ కి లైన్ క్లియర్.. ఫస్ట్ షో నుండి బొమ్మ పడుతోంది..

‘క్రాక్’ కి లైన్ క్లియర్.. ఫస్ట్ షో నుండి బొమ్మ పడుతోంది..

Updated On : January 9, 2021 / 6:03 PM IST

Krack Release: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాకి కష్టాలు తప్పాయి. నిర్మాత ‘ఠాగూర్’ మధు ఆర్థిక వివాదంలో ఇరుకున్న కారణంగా ఈరోజు ఉదయం నుండి ఎక్కడా థియేటర్లలో షోలు పడలేదు. దీంతో రవితేజ ఫ్యాన్స్, ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. మార్నింగ్, మ్యాట్నీ షోలు పడతాయని ఎదురు చూస్తుండగా.. మొదటిరోజు అన్ని ఆటలు రద్దయ్యాని సమాచారం వచ్చింది.

తాజాగా సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందని, ఈ సాయంత్రం నుండి అన్ని ఏరియాల్లో ఫస్ట్ షోలు పడుతున్నాయని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వారు, మాస్ మహారాజా అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.