Bachhala Malli : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.. నేనెవ్వడి కోసం మారను.. నరేష్ మూర్ఖత్వం..
మీరు కూడా బచ్చల మల్లి టీజర్ చూసేయండి..

Allari Naresh Bachhala Malli Movie Teaser Released
Bachhala Malli Teaser : గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కామెడీని పక్కనపెట్టి కొత్త కథలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నాడు. త్వరలో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. తాజాగా నేడు బచ్చల మల్లి టీజర్ రిలీజ్ చేసారు.
ఇక ఈ టీజర్ చూస్తుంటే చిన్నప్పటి నుంచి మల్లి తనకు నచ్చినట్టు మూర్ఖంగా బతుకుతాడు. దాంతో అతని జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి అని సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరోసారి నరేష్ రా & రస్టిక్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మీరు కూడా బచ్చల మల్లి టీజర్ చూసేయండి..
ఇక ఈ బచ్చల మల్లి సినిమాను హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాణంలో సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.