Allari Naresh Ugram: అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాకు హీరోయిన్ దొరికేసింది!
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ‘నాంది’ సినిమాతో ఆయన సీరియస్ మూవీలతోనూ హిట్ అందుకోగలడని నిరూపించాడు. ఇప్పుడు మరోసారి నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపాడు ఈ హీరో. ‘ఉగ్రం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Allari Naresh Ugram Movie Gets Heroine Finalized
Allari Naresh Ugram: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ‘నాంది’ సినిమాతో ఆయన సీరియస్ మూవీలతోనూ హిట్ అందుకోగలడని నిరూపించాడు. ఇప్పుడు మరోసారి నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపాడు ఈ హీరో. ‘ఉగ్రం’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Allari Naresh : మళ్ళీ ఆ కాంబో.. నాంది 2 ??
కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, ప్రేక్షకుల్లో అదిరిపోయే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా అందాల భామ మిర్నా మీనన్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఇక ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల ఓ పవర్‌ఫుల్ కథతో తెరకెక్కిస్తుండగా సాహు గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో ఉగ్రం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.