Ugram Teaser: అల్లరి నరేశ్ ఉగ్రరూపం.. మామూలుగా లేదుగా!

యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల విలక్షణమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో అల్లరి నరేశ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Ugram Teaser: అల్లరి నరేశ్ ఉగ్రరూపం.. మామూలుగా లేదుగా!

Updated On : February 22, 2023 / 1:37 PM IST

Ugram Teaser: యంగ్ హీరో అల్లరి నరేశ్ ఇటీవల విలక్షణమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో అల్లరి నరేశ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Allari Naresh: అక్కినేని హీరో చేతుల మీదుగ ఉగ్రం టీజర్ లాంచ్

ఈ సినిమాను నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మరోసారి అల్లరి నరేశ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. యంగ్ హీరో నాగచైతన్య చేతులమీదుగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఎంగేజింగ్ చేసేలా ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మిర్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, అతిత్వరలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.