Allu Aravind : ఆ సినిమాకు వచ్చిన లాభాల నుంచి సైనికులకు సాయం.. అల్లు అరవింద్ కామెంట్స్..
తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఓ సాయాన్ని ప్రకటించారు.

Allu Aravind Announce Donation to soldiers from Sree Vishnu Single Movie Profits
Allu Aravind : ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. గతంలో అనేక మార్లు మన టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు రాష్ట్రాలకు, దేశానికి తమకు తోచినంత ఆర్ధిక సహాయం చేసారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓ సాయాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం నెలకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే నేడు శ్రీవిష్ణు సింగిల్ సినిమా రిలీజయింది. ఫుల్ కామెడీతో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా సింగిల్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read : Abhinaya : మెగాస్టార్, గ్లోబల్ స్టార్ తో హీరోయిన్ ఫొటో.. భర్తతో కలిసి లండన్ లో మీట్.. ఫొటో వైరల్..
ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మా సపోర్ట్ ఎప్పుడూ మన సైనికులకు ఉంటుంది. సింగిల్ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించనున్నాము. భారత్ మాతా కీ జై అని ప్రకటించారు. దీంతో అల్లు అరవింద్ ని, సింగిల్ సినిమా టీమ్ ని అభినందిస్తున్నారు.